Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడు నాగచైతన్య ఒక లైలాకోసం సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అందంతో, అదృష్టంతో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు కొనసాగుతుంది. అలాంటి ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. ఇక చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ కొన్ని ఫోటోలు షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్... అందులో పూజా హెగ్డే షార్ట్ ఫ్రాక్ ధరించి ఉండగా పూర్తిగా బరువు తగ్గినట్టు కనిపిస్తుంది.. దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు మళ్ళీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా పూజ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయ్.