Nayanthara - Vignesh Sivan: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార గత ఆరు సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ ఓ బిడ్డతో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. నాయాతర ఎత్తుకున్న ఆ పసిబిడ్డ ఎవరు? అంటూ అభిమానులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆ పసిబిడ్డ కూడా నటిస్తుందని అందుకే నయనతార ఎత్తుకుంది అంటూ మరికొందరు గుసగుసలు ఆడుతున్నారు.. మరి ఈ మిస్టరీ కిడ్ ఎవరనేది తెలియాలంటే కాస్త సమయం వేచి చూడాల్సిందే.