Mehreen Kaur Pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అంతేకాకుండా తమిళం, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది. గతంలో ఓ ఎమ్మెల్యే కుమారుడితో నిశ్చితార్థం చేసుకోగా.. ఇటీవలే కొన్ని కారణాలతో అతనికి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో పింక్ డ్రస్సు ధరించగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.