Mehreen Kaur Pirzada: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నెలల క్రితం చడీ చప్పుడూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. అదేంటి ఈ హీరోయిన్ వచ్చి కొన్నేళ్లు కూడా కాలేదు అప్పుడే పెళ్లి ఏంటి అని అభిమానులు షాక్ అయ్యారు. అంతలోనే ప్రస్తుతానికి పెళ్లి ఆపేస్తున్నాం అంటూ ప్రకటించింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని.. భవ్య బిషోని కి తనకి సంబంధం లేదని ఇంస్టాగ్రామ్ లో ప్రకటించింది. అంతేకాదు.. ఇది నా వ్యక్తిగతం.. అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చిన మెహ్రీన్ ఇకపై నా కెరీర్ ని ఇలానే కొనసాగిస్తా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ హీరోనే అని.. సీనియర్ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.