Meera Jasmine: తన నవ్వుతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కేరళ కుట్టి మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర వంటి సినిమాలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ఈ బ్యూటీ. ఇక అలాంటి ఈ బ్యూటీ 2014లో దుబాయ్ కు చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీర్ని వివాహం చేసుకుంది. ఆతర్వాత సినిమాల్లో నటిస్తుంది అనుకుంటే ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది. ఇటీవలే త్వరలోనే మళ్లీ మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు రాగా అవి గుసగుసలుగానే నిలిచాయ్. మరి మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి...