Krithi Shetty: రానాతో బెబమ్మ.. ముద్దు ముద్దు మాటలతో మాములుగా సందడి చెయ్యలేదుగా!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తన అందం, నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది. తొలి సినిమాతోనే బాగా ఆకట్టుకున్న కృతి.. చిన్నప్పటి నుంచి యాడ్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. అలాంటి ఈ భామ 16 ఏళ్ళ వయసులోనే సినిమా అవకాశం కొట్టేసి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ లా ఎదిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే కృతి శెట్టి రానా నెంబర్ 1 యారి షో కు వచ్చి తన ముద్దు ముద్దు మాటలతో రచ్చ రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ టోటల్ ఏపిసోడ్ ఈరోజు రాత్రి జెమినీ టీవిలో, ఆహా యాప్ లో ప్రసారం అవుతుంది.