Kamna Jethmalani: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కామ్నా జెఠ్మలాని పరిచయం తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ వైపు అడుగులు వేసింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లోనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొనగా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ఇక ఈ బ్యూటీ మొదట్లో మోడలింగ్, డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిందట. తన మొదటి జీతం రూ.300 అని తెలిపింది. ఇక తన కష్టం గురించి పెళ్లికి ముందే తన కాబోయేవాడికి చెప్పిందట. ఎంగేజ్మెంట్ సమయంలో పలు సినిమాలలో బిజీగా ఉన్న విషయం, అంతేకాకుండా సినిమా అంటే ఎంత పిచ్చి, ఎంత ఫ్యాషనో అన్ని తన భర్తకు ముందే చెప్పిందట.