Hebah Patel: కుమారి 21 ఎఫ్ తో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయమైన హెబ్బా పటేల్.. ఈ సినిమాతో స్టార్ నైట్ గా మారింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించగా.. అంత సక్సెస్ అందుకోలేదనే చెప్పవచ్చు. తన కెరీర్ లో ఒక్క సినిమానే మంచి సక్సెస్ అందించగా.. మిగతా సినిమాలలో కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంలేనందున బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. అందుకే ఈమెను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. మరి ఈ గుసగుసల్లో ఎంత నిజం ఉందనేది తెలియకపోయినప్పటి ప్రస్తుతం అయితే హెబ్బా చేతిలో అంత అద్భుతమైన సినిమాలు లేవు.