Ashika Gopal Padukone: ఆషిక గోపాల్ పదుకొనె.. స్టార్ మాలో కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మంచి టీఆర్పీ రేటింగ్ తో ఆ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం త్రినయని అనే సీరియల్ లో నటిస్తూ తన అందం, నటనతో ఎంతో మంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్రినయని సీరియల్ లో ముందుగానే భవిష్యత్తును చూసిన కూడా కష్టాలు పడుతూ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ భామ. ప్రస్తుతం జీ తెలుగు టాప్ 5 సీరియల్స్ లో త్రినయని సీరియల్ కూడా ఒకటి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలానే ఇప్పుడు తాజాగా ఓ హాట్ ఔట్ ఫిట్ లో ఫోటోలు షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్.