Guess Who: ఎవరో గుర్తుపట్టారా? ఇంకెవరండీ.. టాలీవుడ్ బ్యూటీ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తన అందంతో ఎంతోమంది యువత మనసును దోచుకుంది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషలలో నటించింది. 2016లో నితిన్ నటించిన అఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం అల్లరిపిల్లగా నిలిచింది అనుపమ. నిత్యం తన ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని తన అందంతో చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఇక ఈ ఫోటోలను చూసిన తన అభిమానులు మాత్రం తన అందాన్ని తెగ పొగుడుతున్నారు.