Samantha Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తన తొలి సినిమాతోనే అందరిని మాయ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హోదాను సంపాదించుకుంది. మరోవైపు బిజినెస్ లో కూడా బాగా దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను పంచుకుంటూ తన అభిమానులను ఫిదా చేస్తుంది. తాజాగా ఓ ఫోటో పంచుకోగా అందులో హాట్ హాట్ లుక్ తో మత్తెక్కించే చూపులతో కవ్విస్తోంది సమంత. మరి మీరు ఆ ఫోటోను చూశారా..