ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున 4.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. వైద్యానికి శరీరం సరిగా సహకరించకపోవడంతో కన్నుమూశారు. Krishna rare pics Twitter
కృష్ణ మరణవార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
కృష్ణ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. రమేష్ బాబు కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం నానక్రామగూడలోని తన నివాసంలో ఉంచారు. సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు.