కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు. అలాంటి హీరోలు తెలుగులో ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబు (Mahesh Babu) నుంచి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరకు చాలా మంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు. (File/Photo)
విజయ్ దేవరకొండ | విజయ్ దేవరకొండ నటుడుగా ఇప్పుడు తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. దాంతో పాటు క్లోత్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. రౌడీ బ్రాండ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. మరోవైపు మల్టీప్లెక్స్ నిర్మాణంలోకి కూడా వచ్చాడు. సొంతూరు మహబూబ్‌నగర్‌లో ఏషియన్ ఫిల్మ్స్‌తో కలిసి ఓ థియేటర్ నిర్మించాడు విజయ్. ఈ మధ్యే లవ్ స్టోరి సినిమాతో ఇది ఓపెన్ అయింది కూడా.
రామ్ చరణ్ | రామ్ చరణ్ ఇప్పటికే హీరోగా స్టార్ అయ్యాడు. ఇక నిర్మాతగానూ సత్తా చూపిస్తున్నాడు. తండ్రి సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలు కూడా నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దాంతో పాటు ఆ మధ్య ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కూడా మొదలు పెట్టాడు. దాంతో పాటు పోలో బిజినెస్ కూడా ఉంది. గుర్రాలంటే ఆసక్తి ఉండటంతో ఆ బిజినెస్ లోకి దిగాడు రామ్ చరణ్.