Tollywood heroes entry Into Bollywood : బాలీవుడ్ అదో కలల లోకం. ఇక మన దక్షిణాది సహా బెంగాలీ హీరోలు కూడా బాలీవుడ్లో నటించాలనేది ఒక డ్రీమ్ అనే చెప్పాలి. కానీ ప్రస్తుతం బీ టౌన్‌కు అంత సీన్ లేదు. ఇపుడు ప్రాంతీయ భాష చిత్రాలే హిందీ చిత్రాలను బీట్ చేసేలా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయినా.. మన హీరోలు అపుడపుడు డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలతో పలకరించిన సందర్భాలున్నాయి. తాజాగా ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన కంటే ముందు బాలీవుడ్లో లక్ పరీక్షించుకున్న హీరోల విషయానికొస్తే.. (File/Photo)
గతేడాది ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగ చైతన్య .. దక్షిణాదికి చెందిన బాలరాజు అనే యువకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో ఆమీర్, నాగ చైతన్య సైనికుల పాత్రల్లో నటించారు. ఇక బాలరాజు అనగానే అక్కినేని నాగేశ్వరరావు స్టార్ హీరోగా చేసి బాలరాజు సినిమా గుర్తుకు వస్తోంది. అదే పాత్ర పేరుతో చైతూ బీ టౌన్ ఎంట్రీ ఇచ్చాడు. (Twitter/Photo) (Twitter/Photo)
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘రామ్ సేతు’లో సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్ చేసారు. ఈ సినిమాలో హీరోతో సమానమైన పాత్రను అది కూడా శ్రీలంకు చెందిన వ్యక్తి పాత్రలో అలరించాడు సత్యదేవ్. ఈ సినిమా కంటే అమితాబ్, ఆమీర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సత్యదేవ్. . (Twitter/Photo)
ప్రభాస్ విషయానికొస్తే.... ‘బాహుబలి’ అనే రీజనల్ తెలుగు సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ‘సాహో’ తో బాలీవుడ్లో సత్తా చాటిన ప్రభాస్.. ఇపుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే డైరెక్ట్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకు ముందు ప్రభాస్ .. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ‘యాక్షన్ జాక్సన్’ అనే హిందీ సినిమాలో అతిథి పాత్రలో మెరిసారు. ఇక ఆదిపురుష్ చిత్రం జూన్ 16l ప్యాన్ వరల్డ్‌గా విడుదల కానుంది. (Instagram/Photo)
రామ్ చరణ్ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బిగ్‌బీ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజర్’ సినిమాను అదే ‘జంజీర్’ పేరుతో రీమేక్ చేసి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. కానీ గతేడాది ఆర్ఆర్ఆర్ అనే ప్యాన్ ఇండియా మూవీతో బీ టౌన్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో గ్లోబల్ లెవల్లో సత్తా చాటాడు. (Instagram/Photo)
నాగార్జున | కెరీర్ మంచి స్పీడ్ మీదున్నప్పుడే.. హిందీ సినిమాల్లో నటించి.. ఓ లెవెల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ ‘శివ’ మూవీతో బాలీవుడ్ ఆడియెన్స్ కు ఇంట్రడ్యూసయ్యాడు నాగార్జున. అప్పటికే..టాలీవుడ్ లో దాదాపు 20 సినిమాల్లో యాక్ట్ చేసారు నాగ్. ఆ తర్వాత 1992 లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి.. ‘ఖుదాగవా’ సినిమాలో నటించాడు నాగ్. (Twitter/Photo)
టాలీవుడ్ హీరోలందరిలో ఎక్కువ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది కూడా నాగ్ కావడం విశేషం. ‘శివ’, ఖుదాగవా’ తర్వాత నాగ్.. హందీలో ‘మిస్టర్ బేచారా’, క్రిమినల్, ద్రోహి,ఎల్.ఓ.సి, అంగారే, అగ్నివర్ష’ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలతో పలకరించారు. మొత్తం 10కి పైగా హిందీ సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసారు నాగార్జున. (Twitter/Photo) (Image; @starmaa)
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన.. గ్యాంగ్ లీడర్ సినిమాను.. హిందీలో ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో రీమేక్ చేసారు చిరంజీవి. అక్కడ కూడా భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఇక బాలీవుడ్ లో చిరంజీవి థార్డ్ అండ్ ఫైనల్ మూవీ.. ది జెంటల్మెన్. ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ లో ఎక్స్ పెరిమెంట్ చేయకుండా .. అక్కడితో అపేసారు.. చిరు. టోటల్‌గా హిందీలో మెగాస్టార్ చేసినవి రీమేక్స్ కావడం విశేషం. (Twitter/Photo)
అనారీ ఇచ్చిన ఊపుతో.. ‘తక్దీర్ వాలా’ అనే మరో సినిమాను రీమేక్ చేసారు. ఈ మూవీ తెలుగులో హిట్టయిన ‘యమలీల’ సినిమాకు రీమేక్. టాలీవుడ్ లో కలెక్షన్స్ కురిపించిన ఈ సినిమా.. బాలీవుడ్ లో ప్లాప్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్ ప్రయోగాలకు వెంకీ దూరంగా ఉన్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాతో బాలీవుడ్లో చాలా కాలం తర్వాత కనిపించనున్నాడు. (Twitter/Photo)
అల్లు అర్జున్ | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ తొలిసారి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసాడు. తగ్గేదేలే అంటూ ప్యాన్ ఇండియా అభిమానులను అలరించారు. ఇక అల్లు అర్జున్ డైరెక్ట్ బాలీవుడ్లో నటిస్తే చూడాలకునే ప్రేక్షకులున్నారు. త్వరలో భూషణ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. పుష్ప హిట్‌తో రెండో భాగంపై బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. (pushpa movie)
ఎన్టీఆర్ | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ అనే ప్యాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఏ రేంజ్లో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.. త్వరలో డైరెక్ట్ హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ( The story of the real bullet used by NTR in RRR)
రజినీ కాంత్ | చాలా కాలం పాటు.. సౌత్ కే పరిమితమైన కోలీవుడ్ సూపర్ స్టార్ .. రజినీ కాంత్. కావల్సినంత ఇమేజ్ ఉన్నా..కొన్నేళ్ల వరకూ బాలీవుడ్ వైపు అడుగు వేయలేదు. 1983 లో అంధా కానూన్ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడీ సూపర్ స్టార్. తనకున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి.. బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయడం కంటిన్యూ చేసాడు.. రజనీకాంత్. అలా బాలీవుడ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడీ హీరో.(Twitter/Photo)
కమల్ హాసన్ | కెరీర్ స్టార్టింగ్ లోనే హిందీ సినిమాలో నటించి.. మొదట్నుంచీ.. బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. హిందీ లో కమల్ ఫప్ట్ మూవీ *ఏక్ దూజేకే లియే’. తెలుగులో హిట్ అయిన మరో చరిత్రకు రీమేక్. కెరీర్లో ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన కమల్.. కేవలం సౌత్ స్టార్ అని ముద్రవేయలేం. అందుకే అతన్ని ఇండియన్ స్టార్ హీరో అంటారు.(Twitter/Photo)
విక్రమ్ | అపరిచితుడు ఫేమ్ చియాన్ విక్రమ్ కూడా.. బాలీవుడ్ లో తన అదృష్టానికి పరీక్ష పెట్టాడు. అభిషేక్ బచ్చన్ తో ఈక్వల్ రోల్ ప్లే చేసిన రావన్ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ సినిమాలో సోలో హీరోగా నటించాడు విక్రమ్. అయితే ఆ మూవీ కూడా ఫెయిల్యూర్ గా నిలిచి.. విక్రమ్ బాలీవుడ్ బాటకు అడ్డంకులు సృష్టించింది.(Twitter/Photo)
ప్రభుదేవా | ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన హీరో కమ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.. ప్రభుదేవా. ఈ టాలెంటెడ్ మల్టీ పర్సనాలిటీ అప్పుడప్పుడూ.. స్పెషల్ అప్పియరెన్స్ లతో బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. గత రెండు మూడేళ్లుగా ఈ హీరో.. డైరెక్టర్ గా బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ‘ఏబిసిడీ’ మూవీలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆడియెన్స్ ను అలరించాడు. (Twitter/Photo)
పృథ్వీ రాజ్ సుకుమారన్ | పృథ్వీ.. మలయాళి యంగ్ స్టార్ హీరో. మాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరో.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ లో 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన పృథ్వీ.. ‘అయ్యా ’మూవీతో హిందీ సినిమాల్లో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత ఔరంగజేబ్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి పలు సినిమాల్లోనటించాడు. (Twitter/Photo)
కోట శ్రీనివాసరావు కూడా అమితాబ్, ఆర్జీవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సర్కార్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన కంటే ముందు తనికెళ్ల భరణి, జీవా, బ్రహ్మానందం, బెనర్జీ, సత్యనారాయణ, రాజనాల వంటి పలువురు క్యారెక్టర్ ఆర్టిస్లులు కూడా బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. (kota srinivasa rao)