వెంకటేష్ మొదలుపెట్టి మూడున్నర దశాబ్ధాలు దాటిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 80 సినిమాలకు పైగానే నటించాడు. డిసెంబర్ 13న ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మరోవైపు ఆయన సాధించిన రికార్డుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులు.. ఆయన చేతుల మీదుగా వచ్చిన హీరోయిన్ల గురించి కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 19 మంది కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన వెంకీ.. దర్శకులను కూడా బాగానే ఇంట్రడ్యూస్ చేసాడు. 10 మంది దర్శకులను ఈయన తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. మరి వెంకటేష్ పరిచయం చేసిన ఆ దర్శకులెవరో చూద్దాం..