సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోల్లో నాగార్జున అక్కినేని ఒకరు. ఆయన కంటే ముందు రజినీ, కమల్ హాసన్ ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ హిందీ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా నాగార్జున బాలీవుడ్లో నటించిన చిత్రాల విషయానికొస్తే.. (File/Photo)
ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో మరోసారి బాలీవుడ్లో నటిస్తున్నారు నాగార్జున. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. (Twitter/Photo)