'మా' అసోషియేషన్ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తాను గెలిస్తే అసోసియేషన్‌కు ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాడు విష్ణు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన విష్ణు అక్కడ మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బుతో కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని.. భవిష్యత్తుతో అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. ఈయన మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఇవే..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న కొందరు సభ్యులు సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. 'MAA App' క్రియేట్ చేసి IMDB తరహాలో ప్రతి ఒక్క 'మా' సభ్యుల పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తామని తెలిపాడు విష్ణు.. 'MAA App' నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కి ఉండేలా చేస్తాం.. 'జాబ్ కమిటీ' నుంచి వారందరికీ సినిమాలు, ఓటిటి వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు ఈయన..
'మా' లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు, కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్స్యూరెన్స్.. కార్పొరేట్ హాస్పిటల్స్‌తో అనుసంధానం.. 'మా' కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తాం.. మూడు నెలలకు ఒకసారి 'మా' కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు.. ప్రతి ఒక్క 'మా' సభ్యుడికి ఉచితంగా ESI హెల్త్ కార్డు అందించే ఏర్పాటు.. ఇప్పటికే 946 మంది 'మా' సభ్యుల పేరు మీదున్న 3 లక్షల భీమా పెంపుదల..
అర్హులైన 'మా' సభ్యుల పిల్లలకు KG to PG వరకు విద్యా సాయం.. అర్హులైన 'మా' సభ్యులకు 'మా' కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సాయం.. 'మా' చరిత్రలో మొట్ట మొదటిసారిగా 'మా' మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు.. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ (including single Mother and single Women) ఆర్థిక సాయం..
గెలిచిన వెంటనే పెన్షన్ల కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్షన్లు అందేలా ఏర్పాటు.. అలాగే 6,000/-లు ఉన్న పెన్షన్‌ను గణనీయంగా పెంచే ఏర్పాట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్షన్ పథకాలు.. NBFCలో ఉన్న పథకాలు మన సభ్యులకు అందేలా ఏర్పాటు
కరోనాతో కళాకారులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు.. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకపడ్డ యువతను ప్రోత్సహించడానికి కొంత కాల పరిమితి వరకు 'మా' మెంబర్షిప్ 75,000/- తగ్గించే ఏర్పాటు.. ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక Cultural and Finance Committee ఏర్పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించి 'మా'ని ఆర్థికంగా బలపరచడం..