ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్ వేరు. అయితే ఆ కాంబినేషన్ కుదరాలంటే ముందు బీజం పడాలి కదా..! అంటే కలిసి నటించాలి కదా. అలా తొలిసారి నటించినపుడే కొన్ని జంటలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఆ తర్వాత వాళ్లనే రిపీట్ చేయాలని దర్శక నిర్మాతలు కూడా భావిస్తుంటారు. కొందరు హీరో హీరోయిన్లు తెరపై ఆ రేంజ్ మ్యాజిక్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జంటలు అలాంటి మ్యాజిక్ చేసాయి. తొలిసారి వాళ్లు స్క్రీన్‌పై కలిసి నటించినా కూడా.. పది సినిమాల కెమిస్ట్రీ చూపించారు. ఉప్పెన, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ సినిమా స్థాయిని పెంచేసాయి. అలాంటి కొన్ని జంటలను ఇప్పుడు చూద్దాం..
10. నాగ చైతన్య - కృతి శెట్టి | నాగ చైతన్య, కృతి శెట్టి తొలిసారి కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘బంగార్రాజు’లో వీరి జోడికి మంచి పేరు వచ్చింది. అందుకే ఇపుడు మరోసారి జోడి కట్టారు. Naga Chaitanya krithi shetty new movie launched Photo : Twitter