Home » photogallery » movies »

TOLLYWOOD FILM CHAMBER OF COMMERCE SENSATIONAL DECISIONS ON MOVIE TICKET RATES ALONG WITH OTT RELEASE TA

Tollywood: ఓటీటీలో విడుదలతో పాటు సినిమా టికెట్ రేట్స్ పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయాలు..

Tollywood : కరోనా పాండమిక్ సమయంలో దేశ వ్యాప్తంగా థియేటర్స్ మూత పడటంతో నిర్మాతలకు ఓటీటీ అనేది ఓ వరంలా మారింది. ఆ తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటి అనుకూలించడంతో థియేటర్స్‌ మళ్లీ తెరుచుకున్నాయి. ఇపుడు అదే ఓటీటీ ఇండస్ట్రీకి భస్మాసురా హస్తంలా మారింది. ఇక ఓటీటీకి అలవాటు పడ్డ జనాలు థియేటర్స్ వైపు చూడటం లేదు. తక్కువ రేటుకే వినోదం దొరకడంతో పాటు మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు దీనికి అడిక్ట్ అయ్యారు. తాజాగా ఈ విషయమై తెలుగు నిర్మాతల మండలి అత్యవసర సమావేశమై పలు సంచలన నిర్ణయాలు వెల్లడించింది.