Tollywood Family Multistarers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా బాబాయి అబ్బాయిలైన వెంకటేష్, రానాలు కలిసి ఇపుడు రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
వెంకటేష్, రానా కలిసి ’రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్, ట్రైలర్ ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగేలా చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో బాబాయి అబ్బాయిలు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. (Twitter/Photo)
ఇప్పటికే వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు. ఇటు నాగార్జున ,నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజుగా మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఇక బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ’ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో తండ్రి కొడుకులుగా కలిసి నటించారు. (Twitter/Photo)
ఆచార్య మూవీతోనైనా తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ తొలి సారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అంతకు ముందు వీళ్లిద్దరు మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150లో కాసేపు నటించి మెగాభిమానులను అలరించారు. (Twitter/Ram Charan Chiranjeevi)
దివంగత సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. (Mahesh Babu Ramesh Babu Krishna)