త్వరలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ పాత్రలో నాగ చైతన్య నటిస్తే.. ఓల్డ్ ఏజ్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించబోతున్నారు. ఇటు నాగార్జున ,నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజుగా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ’ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో తండ్రి కొడుకులుగా కలిసి నటించారు. (Twitter/Photo)
సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక అన్న రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. (Mahesh Babu Ramesh Babu Krishna)
ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ విషయానికొస్తే.. ఈ పెద్దనాన్న కొడుకులు కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో నటించినా.. నిజ జీవిత పాత్రల్లో మాత్రం నటించలేదు. తాజాగా వీళ్లిద్దరు ‘రాధే శ్యామ్’ మూవీలో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో పెదనాన్న, అబ్బాయి పాత్రల్లో నటిస్తారా అనేది చూడాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్‌లో కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. (Facebook/Photo)
మరి మెగాభిమానుల కోరికను వీళ్లిద్దరు ‘ఆచార్య’ సినిమాతో నెరవేరుస్తారా లేకపోతే.. మరేదైనా సినిమాలో నిజ జీవిత పాత్రలు చేసి అభిమానుల కోరిక తీరుస్తారా అనేది చూడాలి. మొత్తంగా మెగా ఫ్యామిలీతో పాటు మిగతా టాలీవుడ్ ఫ్యామిలీ హీరోలు వాళ్ల రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను సినిమాలో చేస్తే చూడాలనుకునే ప్రేక్షకులున్నారు. (Instagram/Photo)