Tollywood Family Multistarers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో తండ్రీ కొడుకులు నటిస్తే ఆ కిక్కే వేరప్ప. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తుండంతో ఆచార్య మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. (Twitter/Photo)
ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాలో నాగార్జున నాగ చైతన్య తండ్రి కొడుకులుగా.. తాతా మనవళ్లుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఈ యేడాది మన దేశంలోనే మొదటి హిట్‌గా నిలిచింది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ‘ఆచార్య’ సినిమా చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (Twitter/Photo)
ఇప్పటికే వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించబోతున్నారు. ఇటు నాగార్జున ,నాగ చైతన్య కలిసి ‘బంగార్రాజుగా మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఇక బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ’ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో తండ్రి కొడుకులుగా కలిసి నటించారు. (Twitter/Photo)
ఆచార్య మూవీతోనైనా తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ తొలి సారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాపై తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ‘ఆచార్య’ లోచరణ్.. సిద్ద అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కథను మలుపు తిప్పడంలో కీలకం అని చెబుతున్నారు (Twitter/Ram Charan Chiranjeevi)
సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. (Mahesh Babu Ramesh Babu Krishna)
ఇపుడు తొలిసారి ‘ఆచార్య’లో పూర్తి స్థాయిలో కలిసి నటించారు. కానీ నిజ జీవిత పాత్రలైన తండ్రీ కొడుకులుగా మాత్రం నటించడం లేదని చెప్పారు. మరోవైపు మెగాభిమానులు కూడా తమ అభిమాన హీరోలను సిల్వర్ స్క్రీన్ పై నిజ జీవిత పాత్రలైన తండ్రీ కొడుకులుగా నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)