Tollywood Family Multistarers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేసారు. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించబోతున్నారు. (File/Photos)
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో చరణ్.. సిద్ద అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ కథను మలుపు తిప్పడంలో కీలకం అని చెబుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, చిరంజీవి.. రక్త సంబంధం ఉన్న పాత్రలో నటిస్తున్నారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. (Twitter/Ram Charan Chiranjeevi)
సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికొస్తే.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక అన్న రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. (Mahesh Babu Ramesh Babu Krishna)
మరి మెగాభిమానుల కోరికను వీళ్లిద్దరు ‘ఆచార్య’ సినిమాతో నెరవేరుస్తారా లేకపోతే.. మరేదైనా సినిమాలో నిజ జీవిత పాత్రలు చేసి అభిమానుల కోరిక తీరుస్తారా అనేది చూడాలి. మొత్తంగా మెగా ఫ్యామిలీతో పాటు మిగతా టాలీవుడ్ ఫ్యామిలీ హీరోలు వాళ్ల రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను సినిమాలో చేస్తే చూడాలనుకునే ప్రేక్షకులున్నారు. (Twitter/Photo)