శోభన్ బాబు తెలుగు సినిమా సోగ్గాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా నటిస్తూనే రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరోగా నిలిచిపోయారు శోభన్ బాబు. ఎన్టీఆర్, ఎన్నాఆర్ నాటి కాలం నుంచి ఆ తర్వాత తరం వరకు ఎంత మంది ఉన్న ఎప్పటికి చెదిరిపోని ఎవర్ గ్రీన్ అందం శోభన్ బాబు సొంతం.. (Photo : Facebook)
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ సినిమాలో తాత పాత్ర సత్యనారాయణ మూర్తి కోసం ముందుగా శోభన్ బాబు గారిని సంప్రదించారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా నిర్మాత అయిన మురళీ మోహన్ ఈ పాత్ర కోసం శోభన్ బాబుకు బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారట. కానీ శోభన్ బాబు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి ససేమిరా అన్నారు. చివరకు ఆ పాత్రను నాజర్‌తో చేయించారు. (Mahesh Babu Trivikram)
పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుస్వాగతం’లో తండ్రి క్యారెక్టర్ రఘువరణ్ పాత్ర కోసం ఆర్.బి.చౌదరి ముందుగా శోభన్ బాబు గారిని అనుకున్నారు. అంతేకాదు ఆయన్నికలిసి ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ కూడా చేసారట. కానీ శోభన్ బాబు చేయనంటే చేయనని ఒకేమాట మీద నిలబడ్డారు. (Twitter/Photo)
ఇక ఎన్నో ప్రాజెక్టులు రిజెక్ట్ చేసిన శోభన్ బాబు చివరకు ఓ చిత్రంలో నటించేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మాణంలో కృష్ణ,శోభన్ బాబు, జగపతి బాబులతో ఓ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకున్నారు. ముహూర్తం కూడా ఖరైరానా.. ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. (File/Photo)