చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతుంది. నాలుగేళ్ళ కింద నానా రచ్చ చేసి.. టాలీవుడ్ పరువు తీసిన ఈ డ్రగ్స్ రాకెట్.. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంది. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ ఈడీ ముందుకు సినీ ప్రముఖులు వరసగా హాజరవుతున్నారు. విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు వరసగా సినీ ప్రముఖులు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అందరికంటే ముందు పూరీ జగన్నాథ్ ఈడీ అధికారుల ముందుకు వెళ్లారు.
ఉదయం 10.30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. 10.05 గంటలకే వచ్చారు పూరీ జగన్నాథ్. ఈ సందర్భంగా మీడియా మాట్లాడాలని ప్రయత్నించింది. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం స్పందించలేదు. కారు దిగి నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ మధ్యాహ్నం వరకు విచారణ సాగనుందని తెలుస్తోంది. పూరీని జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీమ్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 12 మంది సినీ ప్రముఖులకు వేర్వేరు డేట్స్ ఇచ్చారు. మరి వాళ్ళెవరు.. ఆ తేదీలేంటి అనేది ఓ సారి చూద్దాం..