తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో కొంత మంది నటీనటులు విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 2017 జూలై 2న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. అందులో భాగంగా ఈ కేసు విషయంలో నెల రోజుల పాటు విచారించారు అధికారులు. Photo : Twitter
ఈ కేసులో హీరో రవితేజ కారు డ్రైవరుతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి సహా చాలా మందిని విచారించారు. అయితే ఈ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మందికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. Photo : Twitter
మళ్లీ ఈ కేసు విషయంలో అలజడి మొదలైంది. ఈడీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. విచారణకు హాజరు కావాలంటూ హీరోయిన్లు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్.. హీరోలు రవితేజ, రానా, తరుణ్, నవదీప్.. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు నందు, శ్రీనివాస్, ముమైత్ ఖాన్ సహా మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా విచారణకు తేదీలను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. Photo : Twitter