తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఈడీ విచారణను ముమ్మురం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఈరోజు నటి, నిర్మాత ఛార్మిని విచారిస్తున్నారు. కాగా... రకుల్ ప్రీత్ ఈ నెల 6న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరుకావలసి ఉంది. అయితే వరుస షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నానని.. కొంత గడువు ఇవ్వాలని అధికారులను కోరిందట రకుల్. Photo: Instagram
వీరిలో ఆగస్టు 31న పూరి జగన్నాథ్, సెప్టెంబర్ 2న చార్మి ఈడీ విచారణకు హాజరు అవ్వగా.. ఆ తర్వాత ఈ నెల 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. , Photo: Maxim