అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది. కలెక్షన్స్ విషయంలో ఓకే అనిపించినా కూడా టాక్ పరంగా మాత్రం ఈ చిత్రం అనుకున్నంత టాక్ రాలేదు. పుష్ప పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగించలేదు అనేది మాత్రం వాస్తవం.
ఈ సినిమాలో వచ్చిన కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. అలా చేసాడు సుకుమార్. సినిమా ఎలా ఉన్నా కూడా.. కొన్ని సీన్స్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేసాడు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ అయితే రచ్చ రచ్చ అంతే. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను చడ్డీతో నిటబెట్టే సన్నివేశాలు ఏంట్రా బాబూ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలుగులో కాకపోయినా హిందీ. తమిళంలో సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడ మంచి వసూళ్లు తెస్తుంది పుష్ప. ఇప్పటికే అక్కడ లాభాలు కూడా మొదలైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప సేఫ్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. తెలంగాణలో పర్లేదు అనిపించినా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు సుకుమార్.
సినిమా కోసం ఊరమాస్ అవతారంలోకి మారిపోయాడు బన్నీ. హీరో ఆధిపత్యంగా సాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు సుకుమార్ డిజైన్ చేసిన విధానం అద్భుతం అంతే. అందులోనే క్లైమాక్స్ కూడా ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ లాంటి ఇద్దరు పెద్ద నటులను నగ్నంగా చూపించాలని అనుకున్నాడు సుకుమార్. తొలి భాగం క్లైమాక్స్‌లో ఈ సీన్స్ హైలైట్ అయ్యాయి.
ఫహాద్, అల్లు అర్జున్ ఇద్దరూ అండర్వేర్లో మాత్రమే కనిపిస్తారు. సరిగ్గా ఈ సీన్ గురించే సుకుమార్ ఆసక్తికర విషయాల్ని తెలిపాడు. ఈ సీన్‌ను సుకుమార్ ముందు రాసుకున్న విధానం వేరు. ఇద్దర్నీ ఆ సన్నివేశంలో బన్నీ, ఫహద్ ఫాజిల్ ఇద్దరూ నగ్నంగానే ఉండాలని రాసుకున్నాడు సుక్కు. కానీ అంత పచ్చిగా రాసుకుంటే బాగోదని.. అండర్‌వేర్‌తో చూపించాడు సుకుమార్.
అంత దారుణంగా చూపిస్తే తెలుగు ప్రేక్షకులు అంగీకరించరని తెలిసి.. అప్పటికప్పుడు మార్పులు చేసినట్టు చెప్పాడు సుకుమార్. పార్ట్ 2లో కూడా ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయన్నాడు ఈ దర్శకుడు. మొదటి భాగంలో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశామని.. అసలు కధ రెండవ భాగంలో ఉంటుందన్నాడు. మొత్తానికి పుష్ప పార్ట్ 2పై సుక్కు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.