సాధారణంగా దర్శకుల వారసులు బయటికి రారు.. వాళ్ల కుటుంబాలు కూడా మీడియాకు దూరంగానే ఉంటాయి. కేవలం రాజమౌళి కుటుంబం మాత్రమే ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు సినిమా కోసం కుటుంబం అంతా కష్టపడతారు కాబట్టి. ఆయన తప్ప మిగిలిన దర్శకుల కుటుంబాల గురించి పెద్దగా ఐడియా లేదు. అయితే ఇప్పుడు సుకుమార్ కూతురు మాత్రం మీడియా ముందు అదరగొట్టింది. మైక్ పట్టుకుని తన మాటలతో మాయ చేసింది.
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దీనికి వేదిక అయింది. ముంబైలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న సుకుమార్.. అందుకే అక్కడికి రాలేదు. ఆయనకు బదులుగా సినిమా యూనిట్ అంతా వచ్చారు. అయితే దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్ మాత్రం రాలేదు. దేవి చెన్నైలో మిక్సింగ్‌తో బిజీగా ఉండగా.. సుకుమార్ ముంబైలో ఉన్నాడు. ఆ ఇద్దరి స్థానంలో అక్కడికి వచ్చిన గెస్టులంతా సినిమా గురించి మాట్లాడారు.
ఇదిలా ఉంటే సుకుమార్ స్థానంలో ఆయన కూతురు సుకృతి ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ అమ్మాయి మాటలు అభిమానులకు బాగా నచ్చేసాయి. ఇప్పటి వరకు తన కుటుంబాన్ని బయట పెద్దగా పరిచయం చేయలేదు సుకుమార్. కానీ మొదటిసారి మైక్ పట్టుకుని తన తండ్రి గురించి.. సినిమా గురించి మాట్లాడింది సుకుమార్ కూతురు సుకృతి. తండ్రి తరఫున మాట్లాడుతూ అందర్నీ మాయ చేసింది.