యంగ్ హీరోయిన్, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) నాగ చైతన్య డేటింగ్ (Naga Chaitanya Dating) చేస్తున్నారనే వార్తలు ఆన్ లైన్ మాద్యమాలపై హల్చల్ చేస్తున్నాయి. కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ- నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారని, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారనే టాక్ గుప్పుమంది.
శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కానీ ఈ ఇష్యూపై సమంత చేసిన కామెంట్లను తాను వ్యతిరేకిస్తున్నా అంటూ ఓపెన్ అయ్యారు గీతా కృష్ణ. సమంత చేసిన ట్వీట్లో ఇంకా నాగ చైతన్యపై ఆధిపత్యం, ప్రేమ కనిపించదని అన్నారు. మీ పక్కన ఉన్న అమ్మాయిలే ఇలా చేస్తుంటారు తెలుసుకోండి సుమా.. అని అబ్బాయిలకు సమంత ఇలా హింట్ ఇచ్చిందని చెప్పారు.
సమంత చాలా డీసెంట్ పర్సన్ అని చెప్పారు గీతా కృష్ణ. చైతూని పెళ్లి చేసుకున్నాక కూడా సమంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటూ వచ్చిందని అన్నారు. నిజంగా నాగ చైతన్య- శోభిత దూళిపాళ్ల మధ్య రిలేషన్ ఉందో లేదో కానీ.. అమ్మాయిలు ఇలా చాలా మంది ట్రాప్ చేస్తారు సుమా అని సమంత హింట్ ఇచ్చి ఉంటుందని గీతా కృష్ణ పేర్కొన్నారు.