ఎవరైనా సరే.. తొలి సినిమా అనేది వాళ్లకు మరిచిపోలేని అనుభూతి.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఇక అదే వాళ్ల ఇంటి పేరుగా మారిపోతే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది..? అలా ఇండస్ట్రీలో కొందరు నటులు, దర్శకులు తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చాలా మందికి తమ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతో ఏళ్లకేళ్లు అదే వాళ్ల ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటి వాళ్ళలో దిల్ రాజు, అల్లరి నరేష్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.
17. వందేమాతరం శ్రీనివాస్: గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్.. తొలిసారి టి.కృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘వందేమాతరం’ సినిమాతో గాయకుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. అప్పటి నుంచి శ్రీనివాస్ కాస్త .. వందేమాతరం శ్రీనివాస్గా మారారు. (Twitter/Photo)