సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా ఈమె కామెంట్ చేస్తుంటుంది. ఇక్కడ రాజకీయ నాయకులతో పాటు సినిమా హీరోలను కూడా ఓ రేంజ్లో ఆటాడుకుంటుంది శ్రీ రెడ్డి. తాజాగా మరోసారి ఇలాంటి కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మధ్యే తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన హీరో కమ్ పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ గెలుపు గురించి కామెంట్ చేసింది.
తెలుగమ్మాయి అయినా కూడా అలా చెప్పుకోడానికి ఈమె యిష్టపడటం లేదు. అందుకే తమిళ పొన్ను అయిపోయింది. అయితే ఇదే శ్రీ రెడ్డి గతంలో ఉదయనిధి స్టాలిన్ను దారుణంగా టార్గెట్ చేసింది. అప్పట్లో తనతో పాటు ఎంజాయ్ చేసాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యేసరికి ప్లేట్ ఫిరాయించిందంటూ శ్రీ రెడ్డిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.