శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అన్న రీతిలో దిల్ రాజు తీరు ఉందని ప్రొడ్యూసర్ గిల్ట్లోని మిగతా సభ్యులు ఈయన తీరుపై తీవ్ర ఆక్షపణలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 1నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ తీర్మానం చేసారో అతనే ఈ తీర్మానికి తూట్లు పొడవటంపై తోటి నిర్మాతల నుంచే సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. (File/Photo)
సోమవారం నుంచే తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ పిలుపుతో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి. మరికొన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ యథావిధిగా జరిగాయి. ఈ విషయమై చిత్ర పరిశ్రమలో అయోమయం నెలకొంది. యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్‌లోని కీలక సభ్యుడైన దిల్ రాజు తన సినిమాకు సంబంధించిన షూటింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. (file/Photo)
ఇక ప్రొడ్యూసర్ గిల్ట్ తీసుకున్న నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ దాదాపు 18 సినిమాల యధావిధిగా షూటింగ్స్ జరుపుకున్నాయి. అందులో గిల్డ్ కీలక సభ్యుడైన దిల్ రాజు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వారసుడు’ సినిమా షూటింగ్ జరిగింది. దాంతో పాటు గిల్డ్‌లో మరో సభ్యుడైన నాగ వంశీ.. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ‘సార్’ సినిమా షూటింగ్ జరగడం పై అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా ప్రొడ్యూసర్స్ ముందు ఆయా సినిమాలను బై లింగ్వల్ అని చెబుతూ వచ్చారు. కానీ ఇపుడు మాట మార్చి ఇవి తమిళ సినిమాలు ఆ భాషల్లో తెరకెక్కించిన తెలుగులో డబ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గిల్ట్ నూతన అధ్యక్షుడు బసి రెడ్డి మాట్లాడుతూ.. కేవలం తెలుగు సినిమా షూటింగ్స్ మాత్రమే నిలిపివేయాలని కోరినట్టు తెలిపారు. ఇతర భాషలకు సంబంధించిన చిత్రీకరణలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. ఇక వారసుడు సినిమా షూటింగ్ విషయమై నిర్మాత దిల్ రాజు మాట్లాుడుతూ.. మా బ్యానర్లో విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ మాత్రమే చేస్తున్నాము. మిగతా తెలుగు సినిమా షూటింగ్స్ ఏవి చేయడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఈ రోజు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో కార్మికలు జీతాలకు సంబంధించిన ఆయా యూనియన్స్‌కు నిర్మాతలకు మధ్య చర్చలు జరగనున్నాయి. (File/Photo)
ఇక దిల్ రాజు తమిళ సినిమా షూటింగ్ అంటూ కవరింగ్ ఇచ్చినా.. దీనిపై ప్రొడ్యూసర్ గిల్ట్ సభ్యులు సోషల్ మీడియాలో వాడీ వేడి చర్చలు జరిగాయి. సినిమా షూటింగ్స్ బంద్ అన్నపుడు అన్ని షూటింగ్స్ బంద్ చేయాలి. కానీ తాము తెరకెక్కిస్తోన్న తెలుగు సినిమా షూటింగ్స్ మాత్రమే బంద్ చేస్తానని చెప్పడం ఎంత వరకు సమంజం అంటూ ఆఫ్ ది రికార్డుగా దిల్ రాజు తీరును ఎండగడుతున్నారు. మరొవైపు ఇంకొంత మంది నిర్మాతలు తమనకు ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పుకొచ్చారు. మొత్తంగా షూటింగ్స్ బంద్ వ్యవహారం ఎంతో కంటి తుడుపు చర్యగానే కనిపిస్తోందంటున్నారు చాలా మంది. (Twitter/Photo)