Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. తన తల్లి ద్వారా సెలబ్రిటీగా మారింది. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తుంది. సినీ ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తల్లితో కలిసి డాన్సులతో బాగా చేస్తుంది. తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంది. నెగటివ్ కామెంట్స్ వస్తే మాత్రం నోటికొచ్చిన మాటలతో రగిలిపోతుంది. తాజాగా మరోసారి ముచ్చట్లు పెట్టిన సుప్రీత ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఇక ఓ నెటిజన్ తను చివరిసారిగా గూగుల్లో ఏం వెతికావని ప్రశ్నించగా వెంటనే సుప్రీత తన గూగుల్ సెర్చ్ హిస్టరీ ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయగా అందులో తన ఫోన్ కి సంబంధించిన చార్జర్, యాపిల్ ఫోన్ అకౌంట్ విషయాలను సర్చ్ చేసినట్లు తెలిసింది.