2022 Tollywood Break Even Movies | 2022లో అపుడే నాలుగు నెలలు గడిచిపోయాయి. మే నెలలో మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఐదు నెలల కాలంలో నెలకు ఒక్కో సినిమా చొప్పున బాక్సాఫీస్ దగ్గర హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ముఖ్యంగా జనవరిలో బంగార్రాజు హిట్‌గా నిలిస్తే.. ఫిబ్రవరిలో డీజే టిల్లు బ్లాక్ బ్లస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ అబౌ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. ఇక మార్చిలో ఆర్ఆర్ఆర్.. తెలుగులో బాహుబలి 2 అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ 2 తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ స్టేటస్ అందుకుంది. ఇక మేలో శివ కార్తికేయన్ ‘కాలేజ్ డాన్’ కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు డిజాస్టర్ జాబితాలో చేరాయి. (Twitter/Photo)
డిజే టిల్లు: రవితేజ సినిమాకు పోటీగా వచ్చిన డిజే టిల్లు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. పెద్దగా సందడి లేకుండా వచ్చిన టిల్లు భాయ్ మంచి లాభాలు తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్ స్టేటస్‌ను దాటి ‘బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
ట్రిపుల్ ఆర్: మోస్ట్ ప్రజ్టేజియస్ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా రూ. 235 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 601 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ముఖ్యంగా నార్త్ సౌత్, ఈస్ట్ , వెస్ట్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. (Twitter/Photo)
కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఈ సినిమా ఇప్పటి వరకు 1212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (kgf chapter 2)
కాలేజ్ డాన్ | శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలేజ్ డాన్’. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. సర్కారు వారి పాట సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా తెలుగులో సైలెంట్ కిల్లర్‌గా హిట్ స్టేటస్ అందుకుంది.తెలుగులో ఈ సినిమా రూ. 1.3 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగి ఓవరాల్‌గా రూ. 1.75 కోట్లు రాబట్టి.. తెలుగులో రూ. 25 లక్షలకు పైగా లాభాలను తీసుకొచ్చి క్లీన్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా ఐదు నెలల్లో జనవరిలో ‘బంగార్రాజు’ మూవీతో నాగార్జున, నాగ చైతన్య సక్సెస్ అందుకున్నారు. ఫిబ్రవరి సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘టీజే టిల్లు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అటు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ మూవీ అబౌ యావరేజ్‌గా నిలిచింది. మార్చి నెలలో డబ్బింగ్ చిత్రం ‘జేమ్స్’ మంచి వసూళ్లనే దక్కించుకుంది. చివరిగా వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఏప్రిల్‌లో డబ్బింగ్ చిత్రం కేజీఎఫ్ 2 హిట్ స్టేటస్ అందుకుంది. ఇక ఫిబ్రవరి ‘రాధే శ్యామ్’. ఏప్రిల్ లో విడుదలైన చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ మాత్రం టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ మూవీస్‌గా నిలిచాయి.
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్‌కు మరో రూ. 15 కోట్ల దూరంలో ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. ఇంకోవైపు ఎఫ్ 3 ఉండనే ఉంది. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘కాలేజ్ డాన్’ హిట్ స్టేటస్ అందుకొంది. మరి మంత్ ఎండ్ వరకు సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలు హిట్ లిస్టులో చేరుతాయా లేదా అనేది చూడాలి.