Poonam Kaur meets Eetala Rajender: సినీ నటి పూనమ్ కౌర్ శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేట్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్నుసినీ నటి పూనమ్ కౌర్ కలిశారు. శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన పూనమ్ కౌర్.. ఈటల దంపతులను సన్మానించారు.
2/ 6
ఇటీవలే హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించినందుకు ఈటలకు శుభాకాంక్షలు తెలియజేశారు పూనమ్ కౌర్. ధర్మపోరాటం ఎల్లప్పుడూ గెలుస్తుందని ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికలపై కామెంట్ చేశారు.
3/ 6
అనంతరం శాంతికి చిహ్నమైన పావురాన్ని ఈటెల రాజేందర్‌తో కలిసి ఎగురవేశారు. తెల్లటి దుస్తుల్లో కనిపించిన ఆమె.. గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతానికి సంబంధించిన పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చారు.