Catherine Tresa: పాపం కేథరీన్.. అది భారీగా కావాలంటూ డిమాండ్.. అందుకే అవకాశాలు?

Catherine Tresa: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కేథరీన్ థెరీసా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. కన్నడ సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు..చమ్మక్ చల్లో, ఇద్దరమ్మాయిలతో సినిమాలా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. తన నటనతో మంచి గుర్తింపు అందుకొని వరుస సినిమాల్లో నటించింది. సినిమా సినిమాకు గ్లామర్ షో పెంచుతున్న ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు రావడంలేదు. అందుకు కారణం ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని అందుకే అవకాశాలు రావట్లేవని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ గాసిప్స్ లో ఎంత నిజం ఉండనేది తెలియదు కానీ కేథరీన్ నటించిన చివరి చిత్రం విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమానే.