AP - TG 2nd Week Highest Share Movies - Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా రీసెంట్గా 2 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా మొదటి వారం రూ. 78.90 కోట్లు వసూళు చేస్తే.. రెండో వారంలో రూ. 8.80 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధంచిన సినిమాల్లో ‘సర్కారు వారి పాట’ ఎన్నో ప్లేస్లో ఉందంటే.. (Twitter/Photo)
1.ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టి దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో మొదటి వారం రూ. 187.65 కోట్లు. రెండో వారం రూ. 61.11 కోట్లు షేర్ రాబట్టి మొదటి ప్లేస్లో ఉంది. (RRR collections)