Anchor Varshini: బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి. ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తన అందాలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వర్షిణి ఢీ షో లో యాంకరింగ్ గా చేసింది. ఇక ఆ తర్వాత పలు షో లలో కూడా బాగా మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. పైగా అవకాశాల కోసం మరింత రెచ్చిపోతోంది. ఇక తాజాగా ఓ భారీ ఆఫర్ దక్కించుకుంది. అది కూడా ఓ పాన్ ఇండియా మూవీ. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా శాకుంతలం. ఇందులో సమంత కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అవకాశాన్ని అందుకుంది వర్షిణి. ఇక తను నటించే పాత్ర గురించి క్లారిటీ రాకపోగా ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్హ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.