తెలుగు బుల్లితెరపై ఉన్న మేల్ యాంకర్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యాంకర్ రవి. ప్రదీప్ మాచిరాజు తర్వాత రెండో స్థానంలో ఎప్పుడూ రవినే ఉంటాడు. ఈయన ఈ మధ్యే బిగ్ బాస్ 5 తెలుగు నుంచి బయటికి వచ్చాడు ఈయన. అక్కడ్నుంచి దాదాపు 80 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్లీ షోలతో బిజీ అయిపోయాడు యాంకర్ రవి.
తన హోస్టింగ్‌తో అదరగొడుతుంటాడు ఈయన. ముఖ్యంగా మనోడి కామెడీ టైమింగ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ రవికి మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈయన ఎలిమినేషన్ అన్యాయం అంటూ అన్నపూర్ణ గేట్ ముందు కూడా రచ్చ చేసారు ఫ్యాన్స్. బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా వెళ్లొచ్చిన తర్వాత మనోడి క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే రవి ఇప్పుడు పోలీసులను అశ్రయించాడు. తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వెంటనే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరాడు. ఈ విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రవికి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. తనపైనే కాకుండా.. తన కుటుంబ సభ్యులపై కూడా కొందరు కావాలనే దుష్ఫ్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.