Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది. అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది. కానీ బుల్లితెరపైనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేస్తుంది. వ్యక్తిగత పట్ల మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో చీర కట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ చీరలో బాగా మెరిసిపోతుంది రష్మీ గౌతమ్.