ఇక మంజుష రాంపల్లి పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె జూన్ 12, 1990న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో జన్మించారు. యాంకర్ మంజూష 2005లో ఒక టెలిఫిల్మ్‌లో నటించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అయితే ప్రధానంగా 2006లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాతో ఒక్కాసారిగా పాపులర్ అయ్యారు.“రాఖీ” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సోదరి పాత్రలో అదరగొట్టారు. Photo : Instagram
ఇక ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి.. తెలుగులో ప్రముఖ యాంకర్‌గా రాణిస్తున్నారు మంజూష. ఇక ఈ అందాల యాంకర్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మంజూష ఒక్కోషోకు 2 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటారని టాక్. సినిమాల్లో నటించడానికి అయితే 10 లక్షలు వరకు తీసుకుంటారట. అయితే రెమ్యూనరేషన్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న షోలకు ఓ రకంగా ఉంటుంది.. పెద్ద షోలకు మరో రకంగా ఉంటుందనేది టాక్. Photo : Instagram