రవి లాస్య అంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో..? ఎందుకంటే పదేళ్లకు పైగానే ఈ ఇద్దరి స్నేహం ఉంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నారు. అయితే స్నేహితులు అన్న తర్వాత గొడవలు కూడా వస్తుంటాయి కదా.. అలాగే ఈ ఇద్దరి మధ్య కొన్నేళ్లు గొడవలు వచ్చాయి.. మాట్లాడుకోవడం మానేసారు. కనీసం కలవలేదు.. ఆ గ్యాప్‌లోనే శ్రీముఖితో కొన్నేళ్ల పాటు కలిసి ప్రోగ్రామ్స్ చేసాడు రవి.
ఇప్పుడు ఆమెతో విడిపోయిన తర్వాత మళ్లీ లాస్యతోనే కలిసిపోయాడు. గత ఆరు నెలలుగా ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. కలిసి ఈవెంట్స్, షోలు చేస్తున్నారు. రవి లాస్య కలిసిపోయిన తర్వాత డిమాండ్ మళ్లీ పెరిగింది. ఈవెంట్స్‌తో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కనబడుట లేదు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రవి, లాస్య హోస్ట్ చేసారు.