Anasuya Bharadwaj: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి అందరికీ పరిచయమే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో అనసూయ ఎలాంటి పాత్రలో నటించబోతుందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు.. అనసూయ భరద్వాజ్ గాడ్ ఫాదర్ సినిమాలో మంజు వారియర్ పాత్రలో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. మరి అనసూయ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచిచూడాల్సి ఉంది.