Tamannaah Bhatia: తమన్నా భాటియా (Tamannaah Bhatia)ను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి పూర్తి చేస్తుంది తమన్నా. అటు జిమ్ చేస్తూనే.. ఇటు వయ్యారాలు కూడా బయటపెడుతుంది. ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు దాటిపోయింది. ఈమె వయసు ఇప్పుడు 32.. అయినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది తమన్నా.
తాజాగా ఈమె జిమ్ వర్కవుట్స్, యోగా ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. నడుము చూపిస్తూ గుండె జారి గల్లంతయ్యేలా చేస్తుంది మిల్కీ బ్యూటీ. ఇన్నేళ్లలో తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో నటించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్పటి వరకు అమ్మడు ఫుల్లుగా అందాలనే నమ్ముకుని కెరీర్ లాగేస్తుంది. కెరీర్ మొదలుపెట్టి 16 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతుందంటే దానికి కారణం కూడా అమ్మడి అందాలే.
చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది తమన్నా. ఈ మధ్య విడుదలైన అన్ని సినిమాల్లో ఫుల్లుగా అందాలు ఆరబోసింది. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బికినీ కూడా వేసి సెగలు పుట్టించింది తమన్నా. అయితే హాట్ సీన్స్ చేయడం చేయకపోవడం మన యిష్టం అంటుంది తమన్నా. (Tamannaah hot workout/Twitter)
ఇక్కడ ఎవరూ మిమ్మల్ని హాట్ సీన్స్ చేయాలని.. ముద్దులు పెట్టాలని బలవంతం చేయరని.. అంతా మీ యిష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ. తాను ఇండస్ట్రీకి వచ్చినపుడే ముద్దులు పెట్టకూడదని.. నో కిస్సింగ్ పాలసీకి కట్టుబడి వచ్చానని కుంబ బద్దలు కొట్టింది తమన్నా. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. (Tamannaah hot workout/Twitter)
మంచి కథలు వస్తే అన్ని ఇండస్ట్రీలలో నటిస్తానని చెప్తుంది తమన్నా. ఇక మీటూ ఉద్యమంలో ప్రధానంగా వినిపించిన బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌తో ఈమె రెండు సినిమాలు చేసింది. సాజిద్‌తో పని చేస్తున్నపుడు ఎప్పుడూ తనతో తప్పుగా ప్రవర్తించలేదని సర్టిఫికెట్ ఇచ్చింది తమన్నా. (Tamannaah hot workout/Twitter)
ఇక ముద్దు సన్నివేశాల్లో, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని ఎవ్వరూ బలవంతపెట్టరు.. మీకు ఇష్టమైతే నటించడంలో తప్పు లేదు కదా అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించమని బలవంతపెట్టారు అని చెబితే అంతకంటే తెలివి తక్కువ కామెంట్ మరోటి ఉండదంటుంది తమన్నా. (Tamannaah hot workout/Twitter)
తన వరకు ఇండస్ట్రీలో ఎవరూ ఇప్పటి వరకు బలవంతపెట్టింది లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది తమన్నా. అది మనకు మనంగా తీసుకునే నిర్ణయమే కానీ ఇతరులు వచ్చి మనపై ఒత్తిడి చేయరని చెప్పుకొచ్చింది. నీకు యిష్టం అయితే రొమాంటిక్ సీన్స్ వైపు అడుగులు వేయొచ్చు లేదంటే కామ్ అయిపోవచ్చు అంటుంది తమన్నా. (Tamannaah hot workout/Twitter)
తాను పెట్టుకున్న హద్దుల కారణంగా ఇప్పటి వరకు అలాంటి సీన్స్ జోలికి వెళ్లలేదని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో ఓ సినిమాలో తమన్నా లిప్ లాక్ సీన్ చేసింది. అయితే అప్పటికి ఈమె ఇండస్ట్రీకి వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆ సినిమా వచ్చిన సంగతి ఇప్పటి వరకు గూగుల్ కూడా పెద్దగా గుర్తించలేదంటే దాని గురించి మాట్లాడటం కష్టమే. (Tamannaah hot workout/Twitter)