దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ మతిని పోగోట్టింది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. Photos: Instagram.com/taapsee
దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ 1987 ఆగష్టు 1న భారత దేశ రాజధాని న్యూఢిల్లిలో జన్మించింది. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించక ముందు కొన్ని ఉత్పత్తులకు మోడలింగ్ చేసింది. Photos: Instagram.com/taapsee
అంతకు ముందు ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. అలా మోడలింగ్ చేస్తూనే దర్శకేంద్రుడి దృష్టిలో పడింది. Photo: Instagram.com/taapsee
టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన తాప్సీకి సరైన బ్రేక్ లభించలేదు. దీంతో తన సొంత భాషైన బాలీవుడ్‌కి చెక్కేసింది. Photo: Instagram.com/taapsee
అక్కడ ‘ఛష్మే బద్దూర్’ సినిమాతో హిందీ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. నటిగా తాప్సీకి ‘పింక్’ మూవీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. Photo: Instagram.com/taapsee
ఈ మూవీలో ఏకంగా బాలీవుడ్ షెహన్షా అమితాబ్‌తో పోటీపడి నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. Photo: Instagram.com/taapsee
ఆ తర్వాత ‘బేబి’, ‘రన్నింగ్ షాదీ’, ఘాజీ, నామ్ షబానా సినిమాలు తాప్సీకి బాలీవుడ్లో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. Photo: Instagram.com/taapsee
బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తెలుగులో ‘ఆనందో బ్రహ్మా’మూవీతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram.com/taapsee
ఎవరి అండదండలు లేకుండా తాప్సీ బాలీవుడ్లో ఈ స్థాయికి చేరింది. ఎంతలా అంటే ఒకప్పుడు సినిమాలు లేకుండా గడిపిన తాప్సీ ఇపుడు ఎంచక్కా తనకు నచ్చే స్క్రిప్ట్స్‌ను ఎంచుకునేంత స్థాయికి ఎదిగింది. Photo: Instagram.com/taapsee