TOLLYWOOD ACTRESS SUREKHA VANI DAUGHTER SUPRITHA INTRODUCES HER BOY FRIEND FIANCE HERE IS THEIR PHOTOS SK
Supritha: బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన సురేఖవాణి కూతురు.. ఫొటోలు వైరల్.. ఎవరంటే..
Supritha: క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. నెట్టింట యాక్టివ్‌గా ఉండే బ్యూటీ ఇన్‌స్టా లీల్స్, ఫొటో షూట్స్‌తో బిజీగా ఉంటుంది. ఇక సురేఖ, సుప్రిత కలిసి చేసే వీడియోలు బీభత్సంగా వైరల్ అవుతాయి. ఈ తల్లీకూతుళ్లకు అంతలా ఫ్యాన్స్ ఉన్నారు.
సురేఖ, సుప్రిత తమ గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తారు. తల్లీకూతుళ్లలా కాకుండా.. అక్కాచెల్లెల్లా కనిపిస్తూ.. అందాలను ఆరబోస్తారు. పొట్టి దుస్తుల్లో వీరు చేసే వీడియోలను చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. (Image:Instagram)
2/ 6
విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తారు. వీరి వీడియోలకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరి కలిసి ఏ వీడియో చేసినా.. దాని వ్యూస్ లక్షల్లోనే ఉంటాయి. (Image:Instagram)
3/ 6
ఐతే సురేఖ కూతురు సుప్రిత తాజాగా తన జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి.. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. నేను ఒకే చెప్పాను.. అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. (Image:Instagram)
4/ 6
తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో.. అది నెట్టింట వైరల్ అవుతోంది. సుప్రిత మనసును దోచిన అతగాడు ఎవరా? అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఏం పేరు?.? ఏం చేస్తాడు? అని వెతుకుతున్నారు.(Image:Instagram)
5/ 6
సుప్రీత ప్రియుడి పేరు రాకీ జోర్డాన్. ఇతడు కూడా నటుడు. ర్యాపర్‌గా పలు ఆల్బమ్స్ చేశాడు. ఎక్కువగా అమెరికాలో ఉంటాడు. కొంతకాలంగా వీరి మధ్య స్నేహం ఉంది. ఇటీవలే అతడు సుప్రీతకు ప్రపోజ్ చేయగా.. ఆమె ఓకే చెప్పేసింది.(Image:Instagram)
6/ 6
సుప్రితకు ఇన్‌స్టగ్రామ్‌లో 5 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. గ్లామరస్ ఫొటోలు, హాట్ డాన్స్‌లతో అదరగొట్టే ఈ బ్యూటీ.. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. (Image:Instagram)