పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. అది చేసి చూపించాలి అంటే ఎంతో టాలెంట్ ఉండాలి. సమంత అక్కినేని ఈ విషయంలో అందరి కంటే ముందుంది. పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే స్టార్ హీరోలు సమంతతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దర్శక నిర్మాతలు కూడా అక్కినేని కోడలికి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు పెళ్లయింది కదా అని కట్టుబాట్లకు లోబడి సినిమాలు చేయడం లేదు సమంత. తనకు కథ నచ్చితే బోల్డ్ డైరెక్టర్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ మధ్య విడుదలైన ఫ్యామిలీ మాన్ సీజన్ 2లో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజీ అనే శ్రీలంక తీవ్రవాది పాత్రలో అద్భుతంగా నటించింది. అందులో కొన్ని బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది సమంత. తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 ఉత్తమ నటి అవార్డుతో సమంతను సత్కరించింది. ఈ అవార్డు తనను వరించడం ఆనందంగా ఉందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చర్చించింది.
ట్రైలర్ విడుదలైన రోజు నుంచి సమంతపై ఆగ్రహజ్వాలలు రేగాయి. తమిళ అమ్మాయి అయ్యుండి శ్రీలంక తీవ్రవాద పాత్రలో నటిస్తావా అంటూ ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడింది సమంత. తనకు ఇతరుల మనోభావాలు దెబ్బ తీయాలని ఎప్పుడూ లేదని.. నిజంగా ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని.. అందుకోసమే అందులో నటించాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. దీంతో పాటు తమిళనాట విజయ్ సేతుపతి హీరోగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది సమంత. ఇందులో నయనతార మరో హీరోయిన్. ఏదేమైనా సమంత సారీ చెప్పిన తర్వాతైనా రాజీ పాత్రపై రేగిన వివాదం మరిచిపోతారో లేదో చూడాలి.