Renu Desai: తెలుగు సినీ నటి రేణు దేశాయ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈమధ్య ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఓ షోలో జడ్జిగా కూడా చేస్తుంది. రేణుకు మూగ జీవులు అంటే ఎంతో ఇష్టం. రెండు రోజుల కిందట తను అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లులు తప్పిపోయాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఓ రోజు సాయంత్రం డోర్ తెరిచి ఉండటంతో చిన్న తప్పు వల్ల పిల్లులు బయటికి వెళ్లాయని ఎంత వెతికినా కనిపించలేవని అవి ఎక్కడున్నా వాటిని ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపింది. ఇక తాజాగా అవి దొరకడంతో సంబరంలో మునిగింది. ఈరోజు ఉదయం బిల్లింగ్ గార్డెన్ ఏరియాలో తమ పిల్లులు కనిపించాయి అంటూ మీరు అందరు చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు అని రెండు రోజుల బాధ అంతా తీరిపోయిందని ఊపిరిపీల్చుకున్నట్లు అవుతుందని సంతోషాన్ని బయటికి పంచుకుంది రేణు.