చిరంజీవి ఐటమ్ సాంగ్ ఆచార్య" width="1600" height="1600" class="size-full wp-image-1147522" /> రెజీనా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం స్టార్ హీరోయిన్లు అయినా కూడా ఆమె మాత్రం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది పాపం. ఇప్పటికీ తన ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు ఈ ముద్దుగుమ్మకు. దాంతో చివరికి చేసేదేం లేక విలన్ అయిపోతుంది రెజీనా కసెండ్రా. రెండేళ్ల కింద విడుదలైన సెవెన్, ఎవరు లాంటి సినిమాలలో ఈమె విలన్‌గానూ నటించింది.
అయినా కూడా అవకాశాలు రావడం లేదు. తన కెరీర్ కాపాడుకోవడం కోసం ఏకంగా నెగిటివ్ పాత్రలు చేయడానికి కూడా సై అనేస్తుంది రెజీనా. దానికి తోడు హాట్ సీన్స్ కూడా చేస్తుంది ఈమె. ఎవరులో నవీన్ చంద్రతో లిప్ లాక్ సీన్స్ చేయడమే కాకుండా.. బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది. ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది రెజీనా. వీటికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది.
ఇది చూసిన తర్వాత కెరీర్ కోసం రెజీనా పడుతున్న తాపత్రయం అర్థమవుతుంది. ఇప్పటికీ హీరోయిన్ పాత్రలు చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని అన్ని విధాలుగా చెబుతున్నా కూడా పాపం దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదు. మరోవైపు తమిళంలో కూడా అమ్మడు ఫుల్లుగా రెచ్చిపోతుంది. అక్కడ కూడా బికినీ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది రెజీనా.